Shreyas iyer:నైట్ మూవీ చూస్తుంటే కెప్టెన్ నుంచి కాల్.. కట్ చేస్తే క్రికెట్‌లో రికార్డ్
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఈ డైలాగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సరిగ్గా సరిపోతుంది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ తన ఆటతో సత్తా చాటాడు.
నైట్ మూవీ చూస్తుంటే కెప్టెన్ నుంచి కాల్.. కట్ చేస్తే క్రికెట్‌లో రికార్డ్
Shreyas iyer: ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఈ డైలాగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సరిగ్గా సరిపోతుంది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ తన ఆటతో సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి గాయం వల్ల తుది జట్టు నుంచి వైదొలగడంతో ఆ స్థానంలో శ్రేయస్‌కు ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆడటంపై శ్రేయాస్ ఓ ఫన్నీ స్టోరీ చెప్పారు అయ్యర్.
మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలాగే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగో ఛాన్స్ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలిలో వాపు వచ్చింది. నువ్వు మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుందన్నారు. వెంటనే రూంకి వెళ్లి నిద్రపోయా.. అందుకే నాకు ఈ విజయం. ఈ ఇన్నింగ్స్ రెండూ గుర్తుండిపోతాయన్నాడు. విరాట్‌కు గాయం కావడం వల్లే తనకు అవకాశం వచ్చిందన్నాడు. కానీ తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నానని.. ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందని తనకు తెలుసునన్నాడు శ్రేయస్.
ఇలాంటిదే గత ఆసియా కప్ సమయంలోనూ చోటుచేసుకుందన్నాడు. తాను గాయపడడంతో తన ప్లేస్‌లోకి మరొక ప్లేయర్ వచ్చారని.. అతడు సెంచరీ సాధించాడని అన్నాడు. ఆటలో ఇలా జరగడం సహజమేనని చెప్పాడు. తాను గత దేశవాళీ సీజన్ మొత్తం ఆడానని.. అక్కడ చాలా పాఠాలు నేర్చుకున్నానని.. ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నానన్నాడు. తన వైఖరి మార్చుకోలేదని.. తను ఆడే విధానం మార్చుకున్నానని చెప్పాడు శ్రేయస్.
రాత్రంతా మూవీ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న అయ్యర్.. తర్వాత రోజు మధ్యాహ్నం మైదానంలో అడుగుపెట్టి దుమ్మరేపాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశారు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అయ్యర్.. తనకు వచ్చిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకున్నాడు.