Sri Lanka Series: టీమిండియా కెప్టెన్ గా ధావ‌న్, అయ్యార్ లో ఒక‌రికి ఛాన్స్

Srilanka Series: రెండో జ‌ట్టుకు కోచ్ గా ద్ర‌విడ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది

Update: 2021-05-12 08:43 GMT

శ్రేయాస్ ఆయ్యర్ (ఫైల్ ఇమేజ్)

Sri Lanka Series: భార‌త జ‌ట్టుకు జూలైలో శ్రీలంక టూర్ ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నున్నాయి. అయితే భార‌త అగ్ర‌శ్రేణి జ‌ట్టు ఇంగ్లాండ్ కు వెళ్ల‌నుంది. మ‌రో జ‌ట్టును శ్రీలంక టూర్ కు పంప‌నుంది బీసీసీఐ. కాగా..బీసీసీఐ చ‌రిత్ర‌లోనే తొలిసారి భార‌త జ‌ట్టును అగ్ర‌శ్రేణి, ద్వితీయ శ్రేణి జ‌ట్టుల‌గా చేసి టోర్నీ నిర్వ‌హిస్తుంది.

అంతాబాగానే ఉంది కానీ, కెప్టెన్, కోచ్ ఏంపికే క‌ష్ట‌త‌రమ‌వుతుంది. అయితే అగ్ర‌శ్రేణి జ‌ట్టుకు ఎలాగో రెగ్యూల‌ర్ సార‌థి కోహ్లీ ఉన్నాడు. అయితే రెండో జ‌ట్టుకు కోచ్ గా ద్ర‌విడ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇండియా ఏ టీమ్ కి ద్ర‌విడ్ కోచ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా ఎలాంటి టోర్నీలు నిర్వ‌హించ‌డం లేదు. దీంతో ద్ర‌విడ్ ను కోచ్ గా ఎంపిక చేయాల‌ని బీసీసీఐ భావిస్తుంది.

మ‌రో వైపు భార‌త సీనియ‌ర్ ఆట‌గాడు శ్రీనాథ్ పేరుకూడా వినిపిస్తుంది. కోచ్ విష‌యం ప‌క్క‌న పెడితే..జట్టు కెప్టెన్‌ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్, ఐపీఎల్ లో ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యార్ లో ఒకరు కెపె్టన్‌గా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్లుగా టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న ధావన్‌ వరుసగా రెండు ఐపీఎల్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

అయితే కొత్తదనం కోసం యువ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్యార్ ని కూడా సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించే ఛాన్స్ లేక‌పోతేదు. అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. ఢిల్లీ కేపిట‌ల్స్ జ‌ట్ట‌ను విజ‌య‌వంతంగా న‌డిపించిన అనుభ‌వం అత‌నికి ఉంది. బీసీసీఐ సీనియర్‌ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. బౌల‌ర్లు భూవ‌నేశ్వ‌ర్, ఆల్ రౌండ‌ర్ పాండ్య పేర్లు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News