Shoaib Akhtar Slams BCCI: ఐపీఎల్‌కు ఏం జరగొద్దు. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా ఫర్వాలేదు: అక్తర్

Shoaib Akhtar Slams BCCI: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) కోసమే టీ 20 ప్రపంచ కప్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేశారని ఆరోపించారు

Update: 2020-07-23 08:48 GMT
Shoaib Akhtar (File Photo)

Shoaib Akhtar Slams BCCI : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) కోసమే టీ 20 ప్రపంచ కప్ ను  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేశారని ఆరోపించారు పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్‌ అక్తర్‌, రషీద్‌ లతీఫ్‌ .. జియో క్రికెట్‌ చర్చలో పాల్గొన్న ఈ మాజీలు ఈ వాఖ్యలు చేశారు. ఆర్ధికంగా లాభం పడడం కోసమే బోర్డులన్నీ టీ 20 రద్దుకోసమే అంగీకరించాయని వారు అన్నారు.

టీ20 ప్రపంచకప్‌ జరగదని నేను మొదటినుంచి చెప్పుకుంటూ వస్తున్నాను.. ఐపీఎల్‌కు ఏం జరగొద్దు. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా ఫర్వాలేదు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌ ఈ ఏడాది ఆడాల్సింది. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగి ఉండేది.. కానీ అలా జరగలేదు. అయితే దిని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడవి నేను చెప్పలేను. క్రికెట్‌ నాణ్యత దెబ్బతింటున్నప్పటికీ ఆట నుంచి లక్షల డాలర్లు సంపాదించడమే వారికి ముఖ్యం" అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు.

ఇక ఇదే అంశం పైన రషీద్‌ లతీఫ్‌ మాట్లాడుతూ .. టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేసి బీసీసీఐతో సహా అన్ని బోర్డులూ ఆర్ధికంగా బలపడేందుకు ఐకమత్యంగానే ఉన్నాయని అన్నాడు. ఇక అటు ఆసియాకప్‌ వాయిదాపై గంగూలీ ముందుగానే చెప్పాడంటే అతడికి పాక్‌ లేదా లంక బోర్డులే చెప్పుండాలి కదా అంటూ రషీద్‌ లతీఫ్‌ వాఖ్యనించాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్‌ జరగకుండా ఈ ఏడాది ముగియదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వచ్చేఏడాదికి టీ 20 ప్రపంచ కప్ వాయిదా!

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ లో జరగాల్సిన ఈ ప్రపంచ కప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లుగా ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పురుషులకు సంబంధించి వరుసగా వచ్చే మూడేళ్లు మూడు మెగాటోర్నీలు ఉంటాయని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా వాటికి సంబంధించిన షెడ్యూల్ లను కూడా విడుదల చేసింది..

Tags:    

Similar News