ధోనీ స్థానంలో నేనుంటే కచ్చితంగా వీడ్కోలు చెప్పేసేవాడ్ని: షోయబ్ అక్తర్

ధోనీ స్థానంలో నేనుంటే కచ్చితంగా వీడ్కోలు చెప్పేసేవాడ్ని: షోయబ్ అక్తర్
x
Shoaib Akhtar (File Photo)
Highlights

ఇండియన్ మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే..

ఇండియన్ మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.. 2019 ప్రపంచకప్ తర్వాత ధోని వీడ్కోలు పలుకుతాడు అని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి తీసుకున్న ధోని భారత ఆర్మీ కి సేవలందించాడు. ఇలా క్రికెట్ కి ధోని 9 నెలలు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటి మళ్లీ టీం లోకి అడుగు పెట్టాలని భావించాడు. కానీ కరోనా వైరస్ ప్రభావం వలన ఐపీఎల్ కూడా వాయిదా పడింది.. అయినప్పటికీ ధోనీ రిటైర్మెంట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటిపైన ధోని స్పందించలేదు.

అయితే తాజాగా ధోని రిటైర్మెంట్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. 2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించా ల్సింది. అలా రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే హుందాగా ఉండేది. కానీ తన రిటైర్మెంట్ ఎందుకిలా సాగిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒకవేళ ధోనీ స్థానంలో నేనుంటే కచ్చితంగా వీడ్కోలు చెప్పేసేవాడ్ని అని షోయబ్ అక్తర్ వెల్లడించాడు..ధోనీ ఓ మంచి క్రికెటరని, దాంతో పాటే మంచి వ్యక్తని అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ అక్టోబర్ నవంబర్ నెలల్లో ఐపీఎల్ జరిగితే అందులో రాణించి ఆసీస్ లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కి జట్టులో చోటు సంపాదించవచ్చని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories