Shafali Verma: షెఫాలీ వర్మ ఊచకోత.. మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డ్ ఖాయం!
Shafali Verma: టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ ప్రస్తుతం 'లైఫ్ టైమ్ ఫామ్'ను ఆస్వాదిస్తోంది.
Shafali Verma: షెఫాలీ వర్మ ఊచకోత.. మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డ్ ఖాయం!
Shafali Verma: టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ ప్రస్తుతం 'లైఫ్ టైమ్ ఫామ్'ను ఆస్వాదిస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో వరుస హాఫ్ సెంచరీలతో లంక బౌలర్లను వణికిస్తోంది. మంగళవారం తిరువనంతపురంలో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్ షెఫాలీ కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది.
ఆ 75 పరుగులు సాధిస్తే.. నంబర్ 1!
ఒక ద్వైపాక్షిక మహిళల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ స్టార్ హేలీ మాథ్యూస్ (310 పరుగులు) పేరిట ఉంది. షెఫాలీ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటైనా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 69, 79, 79*** పరుగులతో అజేయంగా నిలిచింది. చివరి మ్యాచ్‌లో షెఫాలీ మరో 75 పరుగులు చేస్తే, హేలీ మాథ్యూస్ రికార్డును అధిగమించి ప్రపంచంలోనే ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు
షెఫాలీ అద్భుత ప్రదర్శన ఆమె ఐసీసీ ర్యాంకింగ్స్‌పై కూడా ప్రభావం చూపింది. షెఫాలీ వర్మ నాలుగు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకుకు చేరుకుంది. స్మృతి మంధాన 3వ స్థానంలో స్థిరంగా ఉండగా, రిచా ఘోష్ 20వ స్థానానికి చేరుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఎనిమిది స్థానాలు మెరుగై 6వ ర్యాంకును కైవసం చేసుకుంది. యువ బౌలర్ శ్రీచరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి 52వ ర్యాంకులో నిలిచింది.
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
ఇప్పటికే సిరీస్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి లంకను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం తిరుగులేని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.