Royal Challengers Bangalore: ఆ నలుగురినే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ
Royal Challengers Bangalore: త్వరలో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లతో పాటు మరో రెండు కొత్త జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈసారి జరగనున్న ఐపీఎల్ లో ప్రతి జట్టు నుండి కేవలం నలుగురు ఆటగాళ్ళను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఆయా జట్లు ఎవరిని ఎంపిక చేసుకోవాలో.. ఎవరిని పక్కనపెట్టాలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యాజమాన్యం విరాట్ కోహ్లి, ఏబి డివిలియర్స్, దేవ్ దత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్ ని రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా విరాట్ కోహ్లికి 16 కోట్లు, ఏబి డివిలియర్స్ 12 కోట్లు, యుజ్వేంద్ర చాహల్ 8 కోట్లు, దేవ్ దత్ పడిక్కల్ 4కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు తెలుస్తుంది. మరి రానున్న ఐపీఎల్ లో బెంగుళూరు కెప్టెన్ గా డివిలియర్స్ వ్యవహరిస్తారా లేదా ఇంకెవరనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాలేదు.