Robin Uthappa: ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...
IPL వేలంపై రాబిన్ ఉతప్ప తీవ్రస్థాయిలో స్పందించాడు.
Robin Uthappa: ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...
IPL వేలంపై రాబిన్ ఉతప్ప తీవ్రస్థాయిలో స్పందించాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని వ్యాఖ్యానించాడు. వస్తువుల కోసం పోటీపడుతున్నట్టుగా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని పేర్కొన్నాడు. వేలంలో ఓ ఆటగాడ్ని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే సరి.. ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరమో ఎవరూ ఊహించలేరని ఊతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
వేలం తీరుతెన్నులు చూస్తే క్రికెటర్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు విస్మరించినట్టుగా అనిపించిందని తెలిపాడు. భారత్‌లో తప్ప ఇలా ఆటగాళ్ల వేలం ప్రపంచంలో ఎక్కడా జరగడంలేదని, వేలానికి బదులు డ్రాఫ్ట్ పద్ధతి అమలు చేస్తే బాగుంటుందని ఊతప్ప సూచించాడు.