Rishabh Pant: రిషబ్ పంత్ కీలక నిర్ణయం.. తనకు తానే ఎందుకింత శిక్ష వేసుకున్నాడంటే ?

Rishabh Pant: భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన హెడింగ్లీ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు కొట్టి చరిత్ర సృష్టించాడు. విదేశీ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్ గా నిలిచాడు.

Update: 2025-06-30 03:30 GMT

Rishabh Pant: రిషబ్ పంత్ కీలక నిర్ణయం.. తనకు తానే ఎందుకింత శిక్ష వేసుకున్నాడంటే ?

Rishabh Pant: భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన హెడింగ్లీ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు కొట్టి చరిత్ర సృష్టించాడు. విదేశీ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్ గా నిలిచాడు. అయితే, కొన్ని నెలల క్రితం వరకు అతని కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని పేలవ ప్రదర్శన, ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆడిన ఒక బాధ్యతారహిత షాట్ అతన్ని విమర్శల పాలయ్యేలా చేశాయి. ఈ సంఘటన తర్వాత పంత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ షాట్ వల్ల అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంటరీలో అతన్నిఇడియట్ అని పిలిచాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. పంత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడు. కానీ, అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే, ఇప్పుడు అతను అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సంఘటనలన్నీ పంత్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అతను తన ఆటలో, జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని భావించాడు. దీని తర్వాత పంత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. పంత్ 2025 మార్చిలో తన ఫోన్ నుండి వాట్సాప్‌ను తొలగించాడు. ఫోన్‌ను చాలా వరకు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాడు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాడు. దీనితో పాటు, అతను తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ పై పూర్తిగా దృష్టి పెట్టాడు.

భారత మాజీ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ మాట్లాడుతూ.. పంత్ ఈ సమయంలో తన ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడ్డాడని చెప్పారు. అలసట లేదా వర్క్‌లోడ్ గురించి పట్టించుకోకుండా ప్రతిరోజూ జిమ్‌లో గంటల తరబడి శ్రమించాడు. పంత్ ఏకైక లక్ష్యం తనను తాను మెరుగుపరచుకోవడమే. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు కూడా అతను తన కృషిని కొనసాగించాడు. దేశాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. "అతను పగలు రాత్రి అత్యంత కఠినమైన సెషన్స్ చేసేవాడు. ఖాళీగా ఉన్నప్పుడల్లా నన్ను జిమ్‌కు లాగేవాడు. అతనికి అలసట లేదా పనిభారం గురించి పట్టదు. అతను తనను తాను మెరుగుపరచుకోవాలి అని మాత్రమే చెప్పేవాడు" అని తెలిపారు. పంత్ అంకితభావం ఫలించింది. హెడింగ్లీ టెస్ట్‌లో అతను 134, 118 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, భారత్ ఈ మ్యాచ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది..కానీ పంత్ బ్యాటింగ్ అందరి మనసులను గెలుచుకుంది.

Tags:    

Similar News