UP T20 League : 8 సిక్సర్లు, 7 ఫోర్లు..కట్ చేస్తే 45 బంతుల్లోనే సెంచరీ.. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన రింకూ
UP T20 League : 8 సిక్సర్లు, 7 ఫోర్లు..కట్ చేస్తే 45 బంతుల్లోనే సెంచరీ.. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన రింకూ
UP T20 League : 8 సిక్సర్లు, 7 ఫోర్లు..కట్ చేస్తే 45 బంతుల్లోనే సెంచరీ.. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన రింకూ
UP T20 League : లక్నోలోని ఎకానా స్టేడియంలో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ మెరుపులు మెరిపించారు. కేవలం 45 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్‌తో రన్ చేసి అద్భుతమైన సెంచరీ సాధించి తన జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఒక సమయంలో 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న మీరట్ మావరిక్స్‌ను కెప్టెన్ రింకూ సింగ్ ఆదుకున్నాడు. ఏడు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా రింకూ సింగ్ మైదానం నలువైపులా అద్భుతమైన షాట్లు ఆడి, ఆసియా కప్‌కు ముందు తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో యూపీ టీ20 లీగ్ తొమ్మిదో మ్యాచ్ గోరఖ్‌పూర్ లయన్స్, మీరట్ మావరిక్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్ మావరిక్స్‌కు శుభారంభం దక్కలేదు. కేవలం 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రింకూ సింగ్, సాహెబ్ యువరాజ్‌తో కలిసి 65 బంతుల్లో 130 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గోరఖ్‌పూర్ చేతిలోంచి విజయాన్ని లాక్కున్నాడు. రింకూ సింగ్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
సాహెబ్ యువరాజ్ 22 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో మీరట్ జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకొని 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు గోరఖ్‌పూర్ జట్టుకు కూడా శుభారంభం దక్కలేదు. తొలి వికెట్ కేవలం 3 పరుగులకే పడిపోయింది. ఆర్యన్ జుయల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ధ్రువ్ జురెల్, ఆకాష్‌దీప్ నాథ్ కలిసి రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ధ్రువ్ జురెల్ 32 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆకాష్ దీప్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు. నిశాంత్ కుష్వాహ 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. శివమ్ శర్మ 14 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇలా గోరఖ్‌పూర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మీరట్ తరపున విశాల్ చౌదరి, విజయ్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. జీషన్ అన్సారీకి రెండు వికెట్లు దక్కాయి. ఇది మీరట్‌కు మూడు మ్యాచ్‌ల్లో రెండో విజయం కాగా, గోరఖ్‌పూర్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది.