IPL 2021: పంజాబ్ కింగ్స్ అనూహ్య విజయం

IPL 2021: సన్ రైజర్స్ పై 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విన్

Update: 2021-09-26 01:01 GMT
సన్ రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్డ్ విజయం (ఫైల్ ఇమేజ్)

IPL 2021: ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై పంజాబ్ కింగ్స్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. పంజాబ్ ఇచ్చిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్ రైజర్స్ చేధించలేకపోయింది. ఐదు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 17 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. చివర్లో హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడినా గెలుపు తీరానికి మాత్రం చేర్చలేకపోయాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. పంజాబ్ బ్యాటర్లను 125కే కట్టడి చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు తీసుకున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినా లక్ష్యాన్ని ఛేదించలేక సన్‌రైజర్స్ చేతులెత్తేసింది. వార్నర్, విలియమ్సన్ ఆదిలోనే అవుట్ కావటం భారీ దెబ్బ పడింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు తీశారు.

ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో 37వ మ్యాచులో భాగంగా పంబాజ్ కింగ్స్, స‌న్ రైజ‌ర్స్ ల మ‌ధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు నువ్వా, నేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్ లో పంజాబ్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ ఇచ్చిన 125 పర‌గులు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా స‌న్ రైజ‌ర్స్ చేధించ‌లేక పోయింది. దీంతో పంజాబ్ 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 17 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ కేవలం 5 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ ఏడాది ప్రారంభంలో చెపాక్‌లో హైదరాబాద్ జట్టు రాహుల్ నేతృత్వంలోని జట్టును కేవలం 120 పరుగులకే పరిమితం చేసింది.

Full View


Tags:    

Similar News