Pro Kabaddi 2021: ప్రో కబడ్డీలో అత్యధిక ధర పలికిన టాప్ 5 ఆటగాళ్ళు

* భారత్ లో ఐపీఎల్ తరువాత అత్యంత విజయవంతంగా నిర్వహించబడుతున్న లీగ్ ప్రో కబడ్డీ

Update: 2021-09-01 14:33 GMT

ప్రో కబడ్డీ (ట్విట్టర్ ఫోటో)

Pro Kabaddi 2021: క్రీడాభిమానులకు త్వరలో మరో పండుగ రాబోతుంది. కబడ్డీ కబడ్డీ అంటూ రంగంలోకి దిగడానికి భారత ఆటగాళ్ళు సిద్దం అవుతున్నారు. భారత్ లో ఐపీఎల్ తరువాత అత్యంత విజయవంతంగా నిర్వహించబడుతున్న లీగ్ ప్రో కబడ్డీ. క్రికెట్ తరువాత అభిమానులు కబడ్డీకి ప్రాధాన్యం ఇవ్వడంతో నిర్వాహకులు కూడా ప్రోకబడ్డీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్ 2021 కి సంబంధించి ఆటగాళ్ళ వేలం పాట కూడా ముగిసింది. ఈ వేలం పాటలో అత్యధిక ధర పలికిన మొదటి అయిదు మంది ఆటగాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం..

మొదటి స్థానంలో పాట్నా పైరేట్స్ టీంకి మూడుసార్లు టైటిల్ ని తెచ్చిపెట్టిన ప్రదీప్ నర్వాల్ ను ఉత్తరప్రదేశ్ టీం "యూపీ యోధ" కోటీ 65 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేయడంతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడుగా ప్రదీప్ నర్వాల్ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో సిద్దార్థ్ దేశాయ్ ని కోటీ 30 లక్షలకు "తెలుగు టైటాన్స్" ఎఫ్బిఎం పద్దతిలో రిటైన్ చేసుకుంది. మూడో స్థానంలో గతంలో "పునేరి పల్టన్స్" తరపున ఆడిన ప్లేయర్ మంజీత్ ని 92 లక్షలకు "తమిళ్ తలైవాస్" టీం, నాలుగవ స్థానంలో సచిన్ తల్వార్ 84 లక్షలకు "పాట్నా పైరేట్స్"జట్టు, అయిదవ స్థానంలో రోహిత్ గులియాని "హర్యానా స్టీలర్స్" జట్టు 83 లక్షలకు కొనుగోలు చేశారు.

Tags:    

Similar News