Mitchell Owen: పంజాబ్ కింగ్స్‎ను ఒక్క మ్యాచ్ తోనే వదిలేశాడు.. ఇక్కడ మాత్రం ఏకంగా 17సిక్స్‎లు కొట్టి ఇరగదీశాడు

Mitchell Owen: ఒక ఆటగాడి సత్తా ఏంటో తెలుసుకోవాలంటే అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలి. కానీ, పంజాబ్ కింగ్స్ అది చేయలేదు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టీం కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి పక్కన పెట్టిన ఒక ఆటగాడు ఉన్నాడు.

Update: 2025-06-23 05:38 GMT

Mitchell Owen: పంజాబ్ కింగ్స్‎ను ఒక్క మ్యాచ్ తోనే వదిలేశాడు.. ఇక్కడ మాత్రం ఏకంగా 17సిక్స్‎లు కొట్టి ఇరగదీశాడు

Mitchell Owen: ఒక ఆటగాడి సత్తా ఏంటో తెలుసుకోవాలంటే అతడికి సరైన అవకాశాలు ఇవ్వాలి. కానీ, పంజాబ్ కింగ్స్ అది చేయలేదు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టీం కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి పక్కన పెట్టిన ఒక ఆటగాడు ఉన్నాడు. ఆ ఆటగాడు ఇప్పుడు ఎంఎల్‌సి 2025 (మేజర్ లీగ్ క్రికెట్)లో కేవలం 52 బంతుల్లోనే దుమ్మురేపి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తను ఎవరో కాదు మిచెల్ ఓవెన్. ఇతన్ని పంజాబ్ కింగ్స్, గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో 3 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. కానీ, అతను ఒక మ్యాచ్‌కి మించి ఆడలేకపోయాడు.

ఐపీఎల్ 2025లో మిచెల్ ఓవెన్, పంజాబ్ కింగ్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం (డెబ్యూ) చేశాడు. ఆ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మిచెల్ ఓవెన్, కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా, సున్నాకే అవుట్ అయ్యాడు. కానీ, అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో అతని ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అక్కడ అతను దుమ్ములేపుతున్నాడు. ఫలితంగా, 24 గంటల లోపే అతను రెండోసారి తన జట్టుకు విజయం అందించాడు.

ఎంఎల్‌సి 2025లో మిచెల్ ఓవెన్ చూపించిన లేటెస్ట్ మెరుపు టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్‌లో కనిపించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్, 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. వాళ్ళ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధికంగా 69 పరుగులు చేశాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు 221 పరుగుల లక్ష్యం చాలా పెద్దది. కానీ, మిచెల్ ఓవెన్ ఆ జట్టు విజయానికి ఒక అద్భుతమైన పునాది వేశాడు. దాంతో గెలవడం సాధ్యమైంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ 221 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి, 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అలా ఆ మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలిచింది.

24 గంటల్లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు దక్కిన ఇది రెండో విజయం, దీనికి మళ్ళీ హీరోగా నిలిచింది మిచెల్ ఓవెనే. అతను కేవలం 52 బంతుల్లో 89 పరుగులు చేసి, జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌కే కాకుండా, సరిగ్గా 24 గంటల ముందు ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతను ఇలాంటి అద్భుతమైన విజయమే అందించాడు. అప్పుడు అతను 60 పరుగులు చేసి, మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ వరుసగా రెండు విజయాలు సాధించడానికి కారణంగా నిలిచిన మిచెల్ ఓవెన్.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఎంఎల్‌సి 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అతను ప్రస్తుతం ఫిన్ అలెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 245 పరుగులు చేశాడు.. ఈ క్రమంలో తను 17 సిక్స్‌లు కొట్టాడు.

Tags:    

Similar News