IPL 2022: KKR జట్టుకి గట్టి ఎదురుదెబ్బ...
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ ఝులక్ తగిలింది.
IPL 2022: KKR జట్టుకి గట్టి ఎదురుదెబ్బ...
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ ఝులక్ తగిలింది. లీడింగ్ పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గాయపడ్డాడు. దీంతో అతన్ని ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని తొడ కండరాలకు గాయమైంది. విశ్రాంతి కోసం అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నాడు. వాస్తవానికి గత కొన్ని మ్యాచుల్లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని టాక్. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచుల్లో కమ్మిన్స్ ఏడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్‌తోనూ అతను ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో తోటి ఆటగాళ్లు నిరాశలో ఉన్నారు. కమ్మిన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.