Asia Cup Rising Stars : ఒక్కో పరుగు కోసం ప్రాణం పెట్టిన ప్లేయర్స్..ఉత్కంఠ ఫైనల్‌లో బంగ్లా పై పాక్ సంచలన విజయం

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన థ్రిల్‌ను అందించింది.

Update: 2025-11-24 05:11 GMT

Asia Cup Rising Stars : ఒక్కో పరుగు కోసం ప్రాణం పెట్టిన ప్లేయర్స్..ఉత్కంఠ ఫైనల్‌లో బంగ్లా పై పాక్ సంచలన విజయం

Asia Cup Rising Stars : ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన థ్రిల్‌ను అందించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు సాగింది. చివరకు పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇరు జట్లు 20 ఓవర్లలో చెరి 125 పరుగులతో సమానం కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైందిగా రుజువైంది. పాకిస్తాన్ బ్యాటర్లు బంగ్లాదేశ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. పాక్ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరపున కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.. వారు మాజ్ సదాకత్ (28), అరాఫత్ మిన్హాస్ (25), సాద్ మసూద్ (38). బంగ్లాదేశ్ బౌలర్లలో రిపన్ మొండల్ 3 వికెట్లు తీయగా, రకిబుల్ హసన్ 2 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను కట్టడి చేశారు.

125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు మొదట్లో 22 పరుగుల వద్ద మంచి భాగస్వామ్యం లభించినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 31 పరుగుల తేడాలోనే బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోవడంతో, పాకిస్తాన్ గెలుపు దాదాపు ఖాయమైనట్లు అనిపించింది. ఆ సమయంలో రకిబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చారు. రకిబుల్ హసన్ (24 పరుగులు) 96 పరుగుల వద్ద ఔటైనప్పటికీ, రిపన్ మొండల్, అబ్దుల్ గఫార్ సక్లైన్ పట్టు వదలకుండా 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును 125 పరుగులకు సమం చేసి మ్యాచ్‌ను టైగా ముగించారు.

మ్యాచ్ టై కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్ వైఫల్యం పాకిస్తాన్‌కు కలిసి వచ్చింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 3 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్‌కు కేవలం 7 పరుగుల లక్ష్యం మాత్రమే లభించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని తేలికగా ఛేదించారు. మొదటి 2 బంతుల్లో సింగిల్స్ తీసిన తర్వాత, మూడో బంతికి బౌండరీ కొట్టారు. ఆ తర్వాత నాలుగో బంతికి మరో సింగిల్ తీసి పాకిస్తాన్ జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది.

Tags:    

Similar News