Trent Boult: నా బౌలింగ్ తో టీమిండియాని కుప్పకూలుస్తా

* బౌల్ట్‌ ని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి

Update: 2021-10-31 06:58 GMT

Trent Boult: నా బౌలింగ్ తో టీమిండియాని కుప్పకూలుస్తా

Trent Boult - Virat Kohli: భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో గా మారింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ కి న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిదీ ఎలా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ని ఎలా కుప్పకూల్చాడో నేను అలానే చేస్తానని, భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తాను చూశానని చెప్పుకొచ్చాడు.

భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ త్వరగా ఔటై ఒత్తిడిలో పడటంతో తక్కువ పరుగులకే కట్టడి చేయొచ్చని బౌల్ట్ తెలిపాడు. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇలా చేసే భారత్‌ను ఓడించామని మరోసారి అదే ప్రదర్శనతో టీమిండియాని దెబ్బతీస్తామన్నాడు.

ఇక బౌల్ట్‌ వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మేం బౌల్ట్‌ ని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం. బౌల్ట్‌పైనే కాకుండా మిగతా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఒత్తిడిలో పడేయడమే మా ప్రణాళిక. పాకిస్థాన్‌తో గత 28 నెలలుగా మేం మ్యాచ్ ఆడింది లేదు. కానీ న్యూజిలాండ్‌తో ఈమధ్య మ్యాచ్ లు ఆడాం. వారి బౌలింగ్ ప్రదర్శన గురించి పూర్తి అవగాహన ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టోర్నీల్లో గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ రికార్డే భారత అభిమానులను కలవరపెడుతోంది. మరో పక్క టాస్ కీలకంగా మారనున్న ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి టాస్ గెలుస్తాడా లేదా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News