Cricket: నేటి నుంచి క్రికెట్‌లో కొత్త రూల్..
Cricket: స్టాప్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చిన ఐసీసీ
Cricket: నేటి నుంచి క్రికెట్‌లో కొత్త రూల్..
Cricket: క్రికెట్‌కు ఆదరణ పెంచడానికి ఐసీసీ కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తెస్తోంది. తాజాగా.. వన్ డే, టీ ట్వంటీ క్రికెట్ ఫార్మాట్‌లో వేగం పెంచే దిశగా ఐసీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నేటి నుంచి మరో కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొస్తోంది. స్టాప్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టనుంది. వన్ డే, టీ ట్వంటీ మ్యాచ్‌లలో ఓవర్ కు ఓవర్ కు మధ్య అధిక సమయం వృధా అవ్వకుండా ఉండేందుకు తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇది. ఈ నిబంధన ప్రకారం.. వన్ డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైం గా ఫిక్స్ చేసింది.
దీంతో బౌలింగ్ జట్టు ఓవర్ తర్వాత బౌలర్‌ను మార్చి.. మరో బౌలర్‌ను దించడానికి 60 సెకన్ల సమయమే ఉపయోగించాలి. ఓవర్ తర్వాత బౌలర్‌ని మార్చినప్పుడు.. ఫీల్డింగ్ మార్చుకోవాల్సి వచ్చినా.. ఈ నిర్ణీత సమయంలోనే సెట్ చేసుకోవాలి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. రెండుసార్లు 60 సెకన్లు మించి సమయం తీసుకుంటే.. మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. అంటే.. ఈ ఐదు పరుగులు బ్యాటింగ్ టీం స్కోర్‌కు అదనపు పరుగులుగా కలుస్తాయి. ఆట వేగాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. నేటి నుంచి వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌లో ఈ రూల్ ఫస్ట్ టైమ్ అప్లయ్ కానుంది. ఈ నిబంధన 2024 ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది.