Lanka Premier League: లంక ప్రీమియర్‌ లీగ్ లో భార‌త మాజీ బౌల‌ర్‌!!

Lanka Premier League: బీసీసీఐ నిర్వ‌హించే ఐపీఎల్ కు ఉన్న‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌ను చూసి.. చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఇదే త‌ర‌హాలో టోర్నీల‌ను నిర్వ‌హించ‌డానికి ముందుకు వ‌చ్చాయి.

Update: 2020-09-12 15:48 GMT

Munaf Patel 

Lanka Premier League: బీసీసీఐ నిర్వ‌హించే ఐపీఎల్ కు  ఉన్న‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌ను చూసి.. చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఇదే త‌ర‌హాలో టోర్నీల‌ను నిర్వ‌హించ‌డానికి ముందుకు వ‌చ్చాయి. అలానే శ్రీలంక క్రికెట్‌ బోర్డు ముందుకు వ‌చ్చింది. అదే ‌లంక ప్రీమియర్‌ లీగ్ (ఎల్‌పీఎల్‌) . ఈ సీజ‌న్ కోసం అక్టోబర్ 1 నుంచి ఆటగాళ్ల ఎంపిక కోసం వేలం నిర్వ‌హించున్న‌ది. ఈ టోర్నీకి కూడా వ‌చ్చి ఆదర‌ణనే ఉంద‌ని చెప్పాలి. ఈ వేలంలో సుమారు 150 మంది విదేశి ఆట‌గాళ్లు పాల్గొన్న‌నున్నారు.

ఈ వేలంలో టీమిండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ పాల్గొనబోతున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఇతర దేశాల నుంచి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది, ఇంగ్లాండ్‌ ఆటగాడు రవి బొపారా, బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ బ్రావో, న్యూజీలాండ్ స్టార్‌ కొలిన్‌ మన్రో, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్, వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తదితరులు లంక ప్రీమియర్‌ లీగ్ వేలంలో పాల్గొననున్నారట.

నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఐదు ఫ్రాంఛైజీలతో ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని శ్రీలంక దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 13 మంది స్వదేశీయులతో మొత్తం 19 మంది చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ టోర్నీని బయో బబుల్ వాతావరణంలో నిర్వహించనున్నారు.

మునాఫ్‌ పటేల్.. టీమిండియా త‌రుఫున‌ మొత్తం 13 టెస్టులు, 70 వన్డేలు ఆడిన మునాఫ్‌.. టీ20ల్లో మాత్రం కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు. ‌ 2018లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ త‌రువాత‌ యూఏఈలో నిర్వహించిన టీ10 లీగ్‌లోనూ ఆడాడు.

Tags:    

Similar News