Mumbai Indians: ముంబై మ్యాచ్‌లంటేనే ఏదో వింత.. అంపైరింగ్‌లో అన్నీ అద్భుతాలే జరుగుతాయి.. ఎందుకో మరి!

అంపైర్ అవుట్ ఇవ్వకముందే వెళ్లిపోవడం బెటర్ అంటూ పెవిలియోన్ వైపుకి వెళ్లిపోయాడు.

Update: 2025-05-02 13:33 GMT

Mumbai Indians: ముంబై మ్యాచ్‌లంటేనే ఏదో వింత.. అంపైరింగ్‌లో అన్నీ అద్భుతాలే జరుగుతాయి.. ఎందుకో మరి!

ప్రతిసారి ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడటం.. అంపైర్ ఎవరనేది సంబంధం లేకుండా డ్యూటీ ఎక్కడం బాగా కామన్ అయిపోయింది. వైడ్‌లు, నో బాల్స్‌తో పాటు ముంబై బౌలర్లు ఏం చేసినా చూసి చూసినట్టు అంపైర్లు నడుచుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. SRHతో జరిగిన కాంట్రవర్సీ మరవకముందే మరొ రచ్చ మొదలైంది. ముంబై ఇండియన్స్ అంపైర్లను కొనేసిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ముంబై ఫ్యాన్స్ వాదన మాత్రం వేరేలా ఉంది. 'మా గెలుపు చూసి ఓర్వలేక, మరి ఈ స్థాయికి పడిపోయారేంట్రా మీరు' అని తిరిగి చివాట్లు పెడుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిన ప్రతి సారి అంపైర్ ఆటిట్యూడ్ చూసినప్పుడు సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ అని తప్పక అనిపిస్తుంది. SRH మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్‌కి జరిగిన అన్యాయం మరిచిపోకముందే.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్‌ని బలి చేస్తూ, అంపైర్లను ముంబై కొనేసిందంటూ సోషల్‌మీడియా భగ్గుమన్నది. ముంబై బ్యాటర్‌ ర్యాన్ రికెల్టన్ టోర్నమెంట్‌నే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ముంబై 200కు పైగా పరుగులు చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అయితే, మహేష్ తీక్షణా బౌలింగ్‌లో లెగ్ సైడ్‌కి బాల్‌ని తరలించే ప్రయత్నంలో కంప్లీట్‌గా షాట్ మిస్ చేసిన ర్యాన్... ఇక LBWగా అడ్డంగా దొరికిపోయా అని మైండ్‌లో ఫిక్స్‌ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వకముందే వెళ్లిపోవడం బెటర్ అంటూ పెవిలియోన్ వైపుకి వెళ్లిపోయాడు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది.

బ్యాటర్‌ వెళ్లిపోతుండగా లేనిది.. అప్పీల్ చేయడానికి మాకేం సంబంధం అంటూ, రాజస్థాన్ టీం అంపైర్‌ను "అవుట్ ఇచ్చేయ్ భయ్యా!" అంటూ అరవడం మొదలుపెట్టింది. కానీ అంపైర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కదలకుండా, "అప్పీల్‌తో నాకేం పని? నేను చేయాల్సింది నేను చేస్తాను" అంటూ ర్యాన్ రికెల్టన్‌ను వెనక్కి పిలిచి, "నువ్వు అవుట్ కాదు. నిన్ను అవుట్ అని ఎవరన్నారు? వచ్చి బ్యాటింగ్ చేయి" అని చెప్పి మళ్లీ ఆటలోకి తీసుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత సన్‌రైజర్స్ అభిమానులు ఊరుకుంటారా? మొన్న ఇషాన్ కిషన్ వెళ్లిపోతే ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అంపైర్ ఒక్క ముక్క కూడా మాటాడకుండా అలాగే నిల్చున్నాడు. కానీ ఈరోజు ముంబై బ్యాట్స్‌మన్‌కి వచ్చేసరికి, అంపైరింగ్ రూల్స్ పక్కన పెట్టి మరీ బ్యాట్స్‌మన్‌ను వెనక్కి పిలవడం ఎంత విడ్డూరంగా ఉందో మీరు ఊహించుకోండి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెంట్స్‌లో అంపైర్‌ను తిట్టడమే కాకుండా, టేబుల్ టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌పై కూడా దుమ్మెత్తిపోస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఒక్కసారి జరిగితే పర్వాలేదు, కానీ ప్రతి ముంబై మ్యాచ్లో ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ఇది అనేక అనుమానాలకు దారితీస్తోంది. కారణం ఏదైనా సరే, ముంబై ఇండియన్స్ గెలుస్తూ పోతుండడం, మరియు అంపైర్ల తీరు పట్ల తరచూ ఉత్పన్నమవుతున్న విమర్శల నేపథ్యంలో, ముంబై ఇండియన్స్-అంపైర్ మధ్య జరుగుతున్న ఈ కథ... లైలా మజ్నూ, రోమియో-జూలియట్, సలీం-అనార్కలిలా... అమర ప్రేమికుల జాబితాలో చేరుతుందని అభిమానులు సార్కాస్టిక్‌గా కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News