MS Dhoni Trolled: టుక్‌ టుక్‌ ధోనీ.. ఫ్యాన్స్‌కే మండిపోయింది.. ఇంకెంతకాలం మావా ఇలాగా!

MS Dhoni Trolled: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ఈ ఓటమికి ప్రధానంగా ధోనీనే కారణమని చెబుతున్నారు.

Update: 2025-04-05 15:31 GMT

MS Dhoni Trolled: టుక్‌ టుక్‌ ధోనీ.. ఫ్యాన్స్‌కే మండిపోయింది.. ఇంకెంతకాలం మావా ఇలాగా!

MS Dhoni Trolled: దెబ్బకు ధోనీ ఫ్యాన్స్‌ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. బెస్ట్‌ ఫినీషర్‌ కాస్త వరస్ట్‌ ఫినీషర్‌గా మారిపోయాడు. అసలు ఎందుకు బ్యాటింగ్‌ చేస్తున్నాడో కూడా ధోనీ మర్చిపోయాడు. చెన్నై టీమ్‌ను నట్టేట ముంచి ఓడేలా చేశాడు. మ్యాచ్‌కు ముందు ఎంతో హైప్‌తో బరిలోకి దిగిన మహేంద్రుడు ఢిల్లీపై మ్యాచ్‌లో తేలిపోయాడు. టీ20 ఫార్మెట్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌ చేస్తూ CSK ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ఈ ఓటమికి ప్రధానంగా ధోనీనే కారణమని చెబుతున్నారు. సరైన సమయంలో పరుగులు చేయకపోవడంతో మహేంద్ర సింగ్ ధోనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

రవీంద్ర జడేజా ఔటైన తర్వాత పదవ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. విజయ్ శంకర్ అతనితో పాటు మైదానంలో ఉన్నాడు. ధోని మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి, 10 రన్ రేట్ అవసరం. మ్యాచ్ చెన్నై చేతుల్లో ఉంది. బ్యాటింగ్ సమయం వచ్చినప్పుడు శంకర్, ధోనితో కలిసి సంయమనంతో ఆడారు. దీని కారణంగా కావాల్సిన రన్ రేట్ పెరిగింది.

దీనికి తోడు చెన్నై కీలక బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఎంఎస్ ధోని , విజయ్ శంకర్‌లపై ఒత్తిడి పెంచింది. అయినప్పటికీ, మ్యాచ్ చెన్నై చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు. కానీ వారిద్దరూ దూకుడుగా ఆడకపోవడంతో, మ్యాచ్ CSK చేతుల్లోంచి జారిపోయింది. అదే సమయంలో ఢిల్లీ కూడా బాగా ఆడింది. చెన్నై తరఫున ఆడుతున్నప్పుడు విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని అజేయంగా 26 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ధోనీ ఆడిన తొలి 18బంతుల్లో ఒక బౌండరీ కూడా లేదు. ధోనీ టుక్ టుక్ బ్యాటింగ్‌ ఆడటం వల్లే చెన్నై ఓడిపోయిందని నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News