Mohammed Siraj: 10 కోట్లు ఇస్తామన్నా వద్దన్నాడు.. ఆర్‌సీబీ జట్టుకే జై కొట్టాడు

Update: 2021-12-05 06:32 GMT

Mohammed Siraj: 10 కోట్లు ఇస్తామన్నా వద్దన్నాడు.. ఆర్‌సీబీ జట్టుకే జై కొట్టాడు

Mohammed Siraj: ఐపీఎల్ 2022 సీజన్ కి సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసింది. అయితే లక్నో ఫ్రాంచైజీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రిటెన్షన్ ప్రక్రియకు ముందే పలువురు స్టార్ ఆటగాళ్ళకు భారీగా డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసిందని వార్తలు రావడంతో పాటు లక్నో ఫ్రాంచైజీ పై ఆయా జట్టు యాజమాన్యాలు బిసిసిఐకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పటివరకు పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్, సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ లను లక్నో ఫ్రాంచైజీ ప్రలోభాలకు గురి చేసే మెగా వేలంలో పాల్గొనేలా చేశారని వార్తలు వినిపించాయి.

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కి సైతం రిటెన్షన్ ప్రక్రియకి ముందు లక్నో ఫ్రాంచైజీ 10 కోట్లు ఆఫర్ చేసినా తాను మాత్రం ఆ ఆఫర్ ని తిరస్కరించి ఆర్‌సీబీ తరపునే ఆడటానికి ఇష్టపడ్డాడని తెలుస్తుంది. కెరీర్ లో తనకి మొదట ఆర్‌సీబీ జట్టే అవకాశం ఇచ్చిందని, ఆ జట్టు వల్లనే ప్రస్తుతం టీమిండియాలో కూడా స్థానం సంపాదించిన విషయం గుర్తుపెట్టుకోవాలని అటు ఆర్‌సీబీ అభిమానులు గుర్తు చేశారు.

లక్నో ఫ్రాంచైజీకి నో చెప్పి సిరాజ్ మంచి పని చేశాడని అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక రిటెన్షన్ ప్రక్రియలో బెంగుళూరు జట్టు యాజమాన్యం విరాట్ కోహ్లి(15 కోట్లు), మాక్స్ వెల్(12 కోట్లు), మహమ్మద్ సిరాజ్(7 కోట్లు) లను రిటైన్ చేసుకుంది. డబ్బులకు ఆశపడకుండా ఆర్‌సీబీ జట్టులోనే ఉండి సిరాజ్ మంచి పని చేశాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News