Messi tops in Forbes List: ఆర్జనలో మెస్సీ టాప్
Messi tops Forbes 2020: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న లెజెండరీ పుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఒకరు. ఆయన తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు.
Lionel Messi Cristiano Ronaldo
Messi tops in Forbes list: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న లెజెండరీ పుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఒకరు. ఆయన తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఈ ఏడాది అత్యధికంగా సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్ల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేయగా.. మెస్సీ 126 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.927 కోట్లు) సంపాదనతో టాప్‌లో నిలిచాడు. ఈ సంపాదనలో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా.. మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వ్యాపార ప్రకటనల ద్వారా సంపాదించాడు.
ఇక క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు.. ఎండార్స్‌మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు. ఆ తర్వాతి స్థానం లో పిఎస్‌జి యొక్క స్టార్ నేమార్ 703 కోట్లతో మూడో స్థానం లో నిలిచాడు. నాలుగో స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్-పారిస్నేమార్ జూనియర్ సెయింట్ జెర్మయిన్), సలా (ఈజిప్ట్-లివర్‌పూల్) ఉన్నారు.
ఇక ఈ మధ్యే బార్సిలోనా జట్టును వదిలిపెడుతున్నట్లు చెప్పిన మెస్సీ కి ఆ జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం మెస్సీ జట్టును వీడాలంటే 700 మిలియన్ యూరోలు అంటే 6 వేల కోట్లు చెల్లించాలి అని అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేస్తామని బార్సిలోనా స్పష్టం చేసింది. ఈ విషయం పై మొదట మెస్సీ వాదించిన తర్వాత నేను బార్సిలోనా తోనే ఉంటాను అని స్పష్టం చేసాడు.