Rajinder Goel: అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత దేశవాళీ దిగ్గజ క్రికెటర్ రాజిందర్‌ గోయెల్‌ (77)కన్నుమూశారు.

Update: 2020-06-22 05:00 GMT

భారత దేశవాళీ దిగ్గజ క్రికెటర్ రాజిందర్‌ గోయెల్‌ (77)కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రోహ్‌తక్‌లోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. రాజిందర్‌కు భార్య, కుమారుడు నితిన్‌ గోయెల్‌ ఉన్నారు. నితిన్‌ కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు.

రాజిందర్‌ గోయెల్ హరియాణా, నార్త్‌జోన్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. 70వ దశకంలో గొప్ప స్పిన్నర్‌గా ఖ్యాతిగాంచిన గోయెల్ 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 157 మ్యాచ్‌లు ఆడి 750 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ గోయెల్‌ పేరిటే ఉంది. రంజీల్లో మొత్తం 637 వికెట్లు సత్తాచాటడు 18సార్లు పది వికెట్ల ఘనతను సాధించడం విశేషం.

యునైటెడ్ పంజాబ్ నర్వాణ నగరంలో 1942లో జన్మించిన గొయెల్.. 1958 నుంచి 1985 వరకు దేశవాళీ క్రికెట్‌లో చెరగని ముద్ర వేశారు. ఓ సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం గోయెల్‌కు అవకాశం దక్కలేదు. బేడీ గైర్హాజరీతో 1974లో బెంగళూరు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌కు గోయెల్‌కు పిలుపు అందింది. తుది జట్టులో చోటు దక్కలేదు. రాజిందర్‌ సేవలకు గుర్తింపుగా బీసీసీఐ 2017లో 'సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం' అందజేసింది. గోయల్‌ మృతి పట్ల బీసీసీఐ కూడా సంతాపం వ్యక్తం చేసింది.  

Tags:    

Similar News