మానసిక సమస్యతో విరామం ప్రకటించిన భారత క్రికెటర్

మానసిక సమస్యతో విరామం ప్రకటించిన భారత క్రికెటర్
x
ఆర్యమన్‌ బిర్లా
Highlights

దేశవాళీ క్రికెట్ ఆడుతోన్న భారత క్రికెటర్ మానసిక సమస్యతో బాధపడుతూ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు.

దేశవాళీ క్రికెట్ ఆడుతోన్న భారత క్రికెటర్ మానసిక సమస్యతో బాధపడుతూ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్‌ బిర్లా మధ్యప్రదేశ్‌ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే గత కొంత కాలంగా మానసిక ఒత్తిడి కారణంతో క్రికెట్‌కు తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్లు ట్విట్ చేశాడు.

ఇటీవలి కాలంలో విరామం లేకుండా క్రికెట్ ఆడటంతో మానసిక ఆరోగ్య సమస్యకు గురవుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్‌మ్యాక్స్‌వెల్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు 3 నెలల పాటు విరామం తీసుకున్నాడు. తాజా భారత క్రికెటర్ ఆర్యమన్ బిర్లా కూడా తాత్కాలిక విరామం ప్రకటించాడు.

ఈ సందర్భంగా కొంత కాలంగా మానసికంగా ఒత్తిడితో ఉన్నా. చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఇప్పుడు నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. కాబట్టి నేను ఆటకు కొంత కాలం విరామం ప్రకటిస్తున్నా. మళ్లి తర్వలోనే తిరిగి గ్రౌండ్ లోకి అడుగు పెడతా అని ట్వీట్ చేశాడు.

ఈ 21 ఏళ్ల ఆర్యమన్‌ బిర్లా మధ్యప్రదేశ్‌ తరపున రంజీల్లో ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ బిర్లా 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు. ఐపీఎల్‌‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు 2018, 2019 సీజన్లలో ప్రాతినిథ్యం వహించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగాల్‌‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అండర్‌-23 టోర్నీలో తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories