రాణించినా రాణా.. చెన్నై లక్ష్యం 173 పరుగులు

చెన్నై, కోల్ కత్తా జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోరులో కొలకత్తా జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 172 పరుగులు చేసింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని కోల్ కత్తా జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు.

Update: 2020-10-29 16:05 GMT

చెన్నై, కోల్ కత్తా జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోరులో కొలకత్తా జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 172 పరుగులు చేసింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని కోల్ కత్తా జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు గిల్‌, నితీశ్‌ రాణా మంచి శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఓవర్ లోనే 3 బౌండరీలు బాదేశారు.. గిల్‌ రెండు ఫోర్లు, రాణా ఒక ఫోర్‌ బాదడంతో ఆ జట్టుకు తొలి ఓవర్‌లోనే 13 పరుగులు వచ్చాయి.

అలా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోర్ ను పెంచారు. ఇద్దరు కలిసి 50+ ఓపెనింగ్‌ భాగస్వామ్యం చేసిన తర్వాత చెన్నై లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ బౌలింగ్ లో గిల్‌ 26(17) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీనితో కోల్ కత్తా జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది. ఆ తరవాత వచ్చిన నరైన్‌ 7(7) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూసింగ్‌, రానాతో కలిసి నిదానంగా ఆడాడు.దీనితో 10 ఓవర్లు ముగిసే సమయానికి కోల్ కత్తా జట్టు రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.

ఇక ఆ తరవాత ఇద్దరు కలిసి జోరు పెంచారు. చెన్నై బౌలర్ల పైన విరుచుక పడ్డారు. దీనితో 13 ఓవర్లు ముగిసే సమయానికి కోల్ కత్తా జట్టు 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో రింకూ సింగ్‌ 11(11) భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్వ్కేర్‌లెగ్‌లో ఉన్న జడేజా చేతికి చిక్కాడు. జట్టు మూడు వికెట్లు కోల్పోయినప్పటికి రాణా స్పీడ్ గానే ఆడుతూ తన హైఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే 18వ ఓవర్‌ తొలి బంతిని రాణా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కి పెవిలియన్ కి చేరుకున్నాడు.

ఇక ఆ తరవాత వచ్చిన మోర్గాన్, కార్తీక్ లను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీనితో కోల్ కత్తా జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 5వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Tags:    

Similar News