Ind vs Eng Test Match: కేల్ రాహుల్ కేల్..భారీ స్కోర్ దిశగా భారత్ 276/3

* సెంచరీతో మెరిసిన కేఎల్‌ రాహుల్‌ * 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు

Update: 2021-08-13 01:31 GMT

కే ఎల్ రాహుల్ (ట్విట్టర్ ఫోటో)

India vs England Test Match: టీమిండీయా భారీ స్కోర్‌పై కన్నేసింది. తొలి టెస్ట్‌లో వర్షం కారణంగా జారిపోయిన విజయాన్ని రెండో టెస్ట్‌లో తమ సత్తా చాటి గెలుపొందాలని కసితో ఆడుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్ 3 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది‌. తొలి టెస్టులో కొద్దిలో సెంచరీ మిస్ అయిన కేఎల్‌ రాహుల్‌ రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదేశాడు. దాంతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో శతకం బాదిన మూడో భారత ఓపెనర్‌గా రాహుల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 83 పరుగులతో రాణించాడు. కెప్టెన్‌ కోహ్లీ 42 రన్స్‌తో మెరిపించాడు.

Tags:    

Similar News