Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆసియా కప్‌ లీగ్ మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం..

Asia Cup 2023: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా 2023 ఆసియా కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గ్రూప్ దశలో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Update: 2023-08-29 16:30 GMT

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆసియా కప్‌ లీగ్ మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం..

Asia Cup 2023: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా 2023 ఆసియా కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గ్రూప్ దశలో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొదటిది సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో, రెండోది సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది.

భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ - కేఎల్ రాహుల్ ప్రస్తుతానికి బెంగళూరులోని ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ)లోనే ఉంటాడు. అతను ఆసియా కప్ సూపర్-4 దశకు ముందు సెప్టెంబర్ 4న జట్టులోకి తిరిగి వచ్చే మరోసారి ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తాం. ఆ తర్వాతే కేఎల్ రాహుల్‌ ఆడడంపై నిర్ణయిస్తాం. ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో రాహుల్‌కు చోటు దక్కింది.

కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తాడా?

ద్రవిడ్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ గత వారం రోజులుగా NCAలో చాలా బాగా రాణించాడని చెప్పుకొచ్చాడు. రాహుల్‌లో పురోగతి కనిపిస్తోంది. రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉండేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాం. అతను తిరిగి వస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రస్తుతానికి రాహుల్ జట్టుతో కలిసి ప్రయాణించడం లేదంటూ చెప్పుకొచ్చాడు.

మిడిల్ ఆర్డర్‌లో రాహుల్, పంత్, శ్రేయాస్ మా మొదటి ఎంపిక..

ద్రవిడ్ మాట్లాడుతూ.. మేం ప్రస్తుతం 4, 5 నంబర్‌ల కోసం వెతుకుతున్నామని కాదు. గత 18 నెలలుగా మాకు నంబర్ 4, నంబర్ 5 నిర్ణయించబడ్డాయి. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లను ప్లాన్‌లో చేర్చారు. అయితే 2 నెలల్లోనే ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డారు. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. మంచి విషయమేమిటంటే, ప్రస్తుతం ముగ్గురిలో ఇద్దరు అందుబాటులో ఉన్నారు.

రాహుల్‌కి ఎందుకు అంత ప్రాధాన్యం?

రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మెన్. అతను చాలా కాలం పాటు జట్టు తరపున బాగానే ఆకట్టుకున్నాడు. కానీ, ఇప్పుడు సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌కి నంబర్-5లో అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడే సత్తా కలిగి ఉన్నాడు.

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్

ఆసియా కప్ కోసం బెంగళూరు నుంచి ఆగస్టు 30న కొలంబోకు బయలుదేరవచ్చు. ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్థాన్‌తో జరగనుంది.

Tags:    

Similar News