KL Rahul: 22ఏళ్లలో తొలిసారి.. ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

KL Rahul: భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. లండన్‌లోని ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు.

Update: 2025-08-02 05:00 GMT

KL Rahul: 22ఏళ్లలో తొలిసారి.. ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

KL Rahul: భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. లండన్‌లోని ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌లో రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.


ఓవల్ టెస్టులో కేఎల్ రాహుల్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అంతకు ముందు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో పరుగుల వరద పారించాడు. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టు నుంచి మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు వరకు ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక ఇన్నింగ్స్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్ 5 టెస్టుల 10 ఇన్నింగ్స్‌లలో 532 పరుగులతో తన సిరీస్‌ను ముగించాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 53.20 కాగా, ఇందులో 2 సెంచరీలు మరియు 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 137 పరుగులు.


ఈ సిరీస్ కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్‌లోనే అత్యుత్తమ సిరీస్‌గా నిలిచింది. ఒక సిరీస్‌లో తొలిసారిగా 400 పరుగులకు పైగా సాధించాడు. అంతేకాకుండా, గత 22 ఏళ్లలో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. గతంలో 2003లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా 714 పరుగులు చేశాడు. గ్రేమ్ స్మిత్ తర్వాత మళ్లీ ఇప్పుడు కేఎల్ రాహుల్ మాత్రమే ఇంగ్లాండ్ గడ్డపై ఒక సిరీస్‌లో 500 పరుగులకు పైగా సాధించాడు. ఈ అద్భుతమైన రికార్డును మ్యాథ్యూ హేడెన్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి గొప్ప ఓపెనర్లు కూడా సాధించలేకపోయారు. అలాగే, ఇంగ్లాండ్ ఓపెనర్లు అయిన అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ వంటివారు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు.

Tags:    

Similar News