Karun Nair : టీమిండియాలో కరుణ్ నాయర్ కెరీర్ ముగిసినట్లేనా ?
కరుణ్ నాయర్.. గతంలో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ప్లేయర్.. అలాంటి ఆటగాడి కెరీర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్లు అనిపిస్తుంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు.
Karun Nair : టీమిండియాలో కరుణ్ నాయర్ కెరీర్ ముగిసినట్లేనా ?
Karun Nair : కరుణ్ నాయర్.. గతంలో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ప్లేయర్.. అలాంటి ఆటగాడి కెరీర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్లు అనిపిస్తుంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. కానీ, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. దీంతో కేవలం 43 రోజుల్లోనే అతని టీమిండియా కథ ముగిసిపోతుందేమోనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
2016లో ఇంగ్లండ్‌పై చెన్నైలో 303 పరుగులతో ట్రిపుల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్, ఇప్పుడు అదే ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతను నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కేవలం 25.62 సగటుతో 205 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సిరీస్‌లో అతని ఏకైక హాఫ్ సెంచరీ ఓవల్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో వచ్చింది. అక్కడ అతను 57 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ప్రదర్శన అతనికి జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సరిపోలేదు. టీమిండియా మేనేజ్‌మెంట్ అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
మొత్తంగా కరుణ్ నాయర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 15 ఇన్నింగ్స్‌లలో 579 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఇక వన్డేల విషయానికి వస్తే, అతను రెండు వన్డేలు ఆడి 23 సగటుతో 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ గణాంకాలు అతని కెరీర్‌కు ఊతమివ్వడానికి సరిపోవు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ టీమిండియాలోకి రావడం కష్టమేనని చెప్పాలి.