Kapil Dev: నా శ్రేయోభిలాషులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు: క‌పిల్ దేవ్‌

Kapil Dev: భారత మాజీ క్రికెట్ దిగ్గజం, హరియాణా హరికేన్‌ కపిల్ దేవ్ అస్వస్థతకు గురైన విష‌యం యావ‌త్ క్రీడా ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు

Update: 2020-10-24 06:58 GMT

Kapil Dev: భారత మాజీ క్రికెట్ దిగ్గజం, హరియాణా హరికేన్‌ కపిల్ దేవ్ అస్వస్థతకు గురైన విష‌యం యావ‌త్ క్రీడా ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో పాటు, పెద్ద ఎత్తున సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున్న‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాడు‌ త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. అభిమాన లోకం ముక్తకంఠంతో ప్రార్ధించింది.

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కపిల్ దేవ్  శనివారం ఇన్‌స్టా గ్రాం వేదికగా స్పందించారు. 'నేను బాగుండాలని ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. మీ విషెస్‌లో నేను తడిసి ముద్దయ్యాను. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాను.'అని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరిన కపిల్ దేవ్‌కు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తామ‌ని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News