Ind Vs Eng 4th Test: నాలుగో టెస్ట్ కి దూరంగా ఆండర్సన్, బట్లర్..!!

* ఓవల్ మైదానంలో చెత్త రికార్డు వల్ల జేమ్స్ ఆండర్సన్, భార్య ప్రసవం కోసం జోస్ బట్లర్ నాలుగో టెస్ట్ కి దూరం

Update: 2021-09-01 10:12 GMT

ఆండర్సన్, జోస్ బట్లర్ (ట్విట్టర్ ఫోటో)

India Vs England 4th Test: సెప్టెంబర్ 2 గురువారం నుండి మొదలుకానున్న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే రెండో టెస్ట్ ఘన విజయం తరువాత మూడో టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఓటమి బాధ నుండి బయటపడి నాలుగో టెస్ట్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే నాలుగో టెస్ట్ లో జట్టులో మార్పులు ఉండనున్నాయని కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పకనే చెప్పాడు.

మరోపక్క ఇంగ్లాండ్ జట్టులో కూడా వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాలుగో టెస్ట్ కి దూరంగా ఉండనున్నాడు. తన సతీమణి ప్రసవానికి ముందు తనకి తోడుగా ఉండాలని బట్లర్ లీవ్ లో ఉన్నాడు. ఓవల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు చెత్త రికార్డు ఉండటంతో పాటు వరుస టెస్ట్ మ్యాచ్ లతో విశ్రాంతి లేకుండా ఉన్న పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ని నాలుగో టెస్ట్ లో పక్కన పెట్టె అవకాశాలు ఉన్నాయి. ఇక జోస్ బట్లర్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ కి అవకాశం ఇవ్వగా, బేర్ స్టౌ కీపింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

జేమ్స్ ఆండర్సన్ స్థానంలో మార్క్ వుడ్ లేదా క్రిస్ వోక్స్ నాలుగో టెస్ట్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క టీమిండియాలో గాయం కారణంగా ఆసుపత్రి పాలైన రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్ రాక ఖరారు అవగా, అజింక్య రహనే స్థానంలో సూర్య కుమార్ యాదవ్ లేదా హనుమ విహారికి తుది జట్టులో స్థానంలో లభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News