Farewell Match : ఫేర్వెల్ మ్యాచ్‌ : ధోని సేన vs కోహ్లి సేన

Farewell Match : గత దశాబ్ద కాలంగా చాలా మంది దిగ్గజ ఆటగాళ్ళు క్రికెట్ కి గుడ్ బై చెప్పారు.. గంగూలీ నుంచి మొన్న ధోని, రైనా వరకు చాలా మంది తమ

Update: 2020-08-23 07:07 GMT

indian cricket team

Farewell Match : గత దశాబ్ద కాలంగా చాలా మంది దిగ్గజ ఆటగాళ్ళు క్రికెట్ కి గుడ్ బై చెప్పారు.. గంగూలీ నుంచి మొన్న ధోని, రైనా వరకు చాలా మంది తమ ఆటకు విశ్రాంతినిచ్చారు.. అయితే ఇందులో సచిన్, గంగూలీ తప్ప చాలా మంది ఆటగాళ్లకి సరైన వీడ్కోలు‌ మ్యాచ్‌ దొరకలేదనే చెప్పాలి.. దీనిపట్ల కొందరు క్రికెటర్లు బహిరంగంగానే తమ మనోవేదనని వ్యక్తం చేశారు.. ఇండియన్ మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించాక ఓ షోలో మాట్లాడుతూ బీసీసీఐ తనకి, మరికొందరు ఆటగాళ్లకి సరైనా వీడ్కోలు ఇవ్వలేదని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు..

2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత సీనియర్ ఆటగాళ్ళు ఒక్కోకరిగా వైదొలగుతూ వచ్చారు. కనీసం వారికీ వీడ్కోలు‌ మ్యాచ్‌ కూడా దొరకలేదు.. అలాంటి వారిలో గౌతమ్ గంభీర్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, యువీ, రైనా, ఇర్ఫాన్‌, జహీర్‌ లాంటి దిగ్గజాలు ఉన్నారు. వారికీ గ్రాండ్ గా వీడ్కోలు‌ మ్యాచ్‌ ఇవ్వలేదని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. ఇప్పటికి ఫీల్ అవుతూనే ఉన్నారు.. ఈ క్రమంలో ఇండియన్ మాజీ అల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ ఓ కొత్త ఆలోచనని తీసుకువచ్చాడు.. రిటైరైన ఆటగాళ్ళు .. ప్రస్తుత కోహ్లీ సేనకు ఓ ఛారిటి మ్యాచ్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందని అభిమానులను అడిగాడు. అది రిటైరైన అయిన ఆటగాళ్ళకి అదో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌లాగా ఉంటుందని అన్నాడు.. ఇక రిటైరైన ఆటగాళ్లతో ఒక జట్టును కూడా రూపొందించాడు ఇర్ఫాన్ పఠాన్‌.

దీనికి సంబంధించిన జాబితా ఇలా ఉంది..

గౌతమ్‌ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, ధోనీ, ఇర్ఫాన్‌ పఠాన్‌, అజిత్‌ అగార్కర్‌, జహీర్‌ఖాన్‌, ప్రగ్యాన్ ఓజా. 


Tags:    

Similar News