CSK Vs GT: ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్

CSK Vs GT: ఆఖరి బంతిని బౌండరీగా మలచి విజయాన్ని అందించిన జడేజా

Update: 2023-05-30 02:11 GMT

CSK Vs GT: ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్

CSK Vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ అవతరించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై జట్టు సత్తా చాటింది. సాధికార విజయంతో ఛాంపియన్ ‌గా నిలిచింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు వరుణదేవుడు అడుగడుగునా ఆటంకం కలిగించాడు. 48 గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ నిర్ణీత సమయానికి జరగకపోగా మరుసటి రోజుకి వాయిదా పడింది. దీంతో నిర్ణీత సమయానికి మ్యాచ్ ఆరంభమైంది.

టాస్ గెలిచిన చెన్నై కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ పై పట్టు సాధించి విజేతగా నిలిపే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆటను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. అర్ధరాత్రి లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 214 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 15 ఓవర్లకి 171 పరుగులుగా నిర్దేశించారు. చెన్నైఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అడపాదడపా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ , దేవాన్ కాన్వే దూకుడు ప్రదర్శించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అజింక్య రహానె , అంబటి రాయుడు క్రీజులో ఉన్నంతసేపు హిట్టింగ్‌తో అదరగొట్టేశారు. చెన్నై కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒత్తిడిలో తొలిబంతికే పెవీలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి వచ్చిన శివందుబే, రవీంద్ర జడేజా కళ‌్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. లక్ష్యానిక చేరువయ్యారు. రవీంద్ర జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్‌తో పాటు, ఓ బౌండరీ బాదడంతో విజయం చెన్నైజట్టును వరించింది. ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై ఛాంపియన్ గా నిలిచింది.

Tags:    

Similar News