IPL 2025: ఐపీఎల్ నిరవధిక వాయిదా
IPL 2025: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది.
IPL 2025: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోఠ్‌లో పాకిస్తాన్ డ్రోన్, వైమానిక దాడుల నేపథ్యంలో మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత క్రికెటర్లతో పాటు సిబ్బంది, బ్రాడ్‌క్యాస్టింగ్ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైలును పంపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్‌ను నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి వివరించారు.