IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. ఇకపై హెడ్ కోచ్‌గా..
Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది.
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. ఇకపై హెడ్ కోచ్‌గా..
Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని తప్పించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ ప్రకటించింది. 'క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్‌లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు' అని సన్‌రైజర్స్ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ లారాతో ఒప్పందం కుదుర్చకుంది.