IPL 2021: రాజస్థాన్ ‌పై 10 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Update: 2021-04-23 01:00 GMT
బెంగళూరు ఓపెనర్లు (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అలాగే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

ఆరంభం నుంచే ఆర్‌సీబీ ఓపెనర్లు రాజస్థాన్ బౌలర్లపై విరుచపడ్డారు. ఏ దశలోనూ బౌలర్లను వదలకుండా బౌండరీలు సాధిస్తూ.. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో ఆర్‌సీబీ విజయం చాలా తేలికైంది. ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్ కేవలం 52 బంతుల్లో 101 ‌మెరుపు వేగంతో సెంచరీ చేశాడు. దేవదత్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అలాగే మరో ఓపెనర్ ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లి 72 పరుగులతో అలరించాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శివమ్‌ దూబే(46) రియన్‌ పరాగ్‌(25)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 109 పరుగుల వద్ద పరాగ్‌ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్‌ తెవాటియా(40, 23 బంతులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే దూబే, తెవాటియాలు వెనుదిరిగిన తర్వాత రాజస్తాన్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 3 వికెట్లు తీయగా.. జేమిసన్‌, రిచర్డ్‌సన్‌, సుందర్‌లు తలా ఒక వికెట్‌ తీసింది. అంతకముందు రాజస్తాన్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాటియా(40) ఔట్‌ కాగా..హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో మోరిస్‌(10) చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 3 వికెట్లు తీయగా.. జేమిసన్‌, రిచర్డ్‌సన్‌, సుందర్‌లు తలా ఒక వికెట్‌ తీసింది. 

Tags:    

Similar News