PBKS vs RCB Match Preview: నేడు బెంగళూరుతో పంజాబ్ ఫైట్.. రికార్డులివే!

PBKS vs RCB Match Prediction: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది.

Update: 2021-04-30 09:20 GMT

బెంగళూరు వర్సెస్ పంజాబ్ (ఫొటో ట్విట్టర్)

PBKS vs RCB Match Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది.

హెడ్ టు హెడ్

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.

అత్యధిక స్కోర్

బెంగళూరుపై ఇప్పటి వరకు పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు. అలాగే పంజాబ్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 226 పరుగులు.

టీంల బలాబలాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

బెంగళూరు జట్టులో ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ బాగానే ఆడుతున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ కూడా టైంకి తగ్గట్టు ఆదుకుంటున్నారు. దీంతో టీమ్‌ మెరుగైన స్కోరు చేసేందుకు దోహదపడుతున్నారు. రజత్ పాటిదార్‌ చేరికతో ఆ జట్టు టాప్ ఆర్డర్‌ బలంగా తయారైంది. అయితే.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్నాడు.

బౌలింగ్ పరంగా.. హర్షల్ పటేల్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌. బెంగళూరు టీంని విజయ తీరాలు చేసే ప్రదర్శన చేస్తున్నాడు. అలాగే మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్ పవర్ ప్లేలో చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్ చాహల్ మాత్రం ఈ సీజన్ లో ప్రతీ మ్యాచ్ లో విఫలమవుతున్నాడు.

పంజాబ్ కింగ్స్

కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగానే కనిపిస్తుంది. కానీ, అప్పుడప్పుడు అంచనాలను అందుకోలేక విఫలమవుతున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పవర్‌ప్లేలో బాదేస్తున్నారు. ఆ తర్వాత వస్తున్న క్రిస్‌గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ హిట్టింగ్ చేస్తు.. మ్యాచ్ గమన్నాన్ని మర్చేస్తున్నారు. అయితే, కేఎల్ రాహుల్ త్వరగా ఔటయితే మాత్రం.. టీం మొత్తంలో ఆదుకునేవారు లేక తక్కువ స్కోరు వద్దే ఆగిపోతున్నారు. ఆల్‌రౌండర్ హెన్రిక్యూస్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడు. అలాగే యువ హిట్టర్ షారూక్ ఖాన్ బాగానే ఆడుతున్నా.. ఫినిషర్ రోల్‌ని పోషించలేకపోతున్నాడు. దాంతో.. డెత్ ఓవర్లలో పంజాబ్ ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోతోంది.

పంజాబ్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్ రవి బిస్ణోయ్, దీపక్ హుడా పరుగులను కట్టడి చేస్తున్నారు. క్రిస్ జోర్దాన్ మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. జోరుమీదున్న బెంగళూరుపై గెలవాలంటే మాత్రం పంజాబ్ టీం అన్ని రంగాల్లో సత్తా చాటాల్సిందే.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (కీపర్), వాంగ్‌టన్ సుందర్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్.

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, డేవిడ్ మలన్ / నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్ / రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

Tags:    

Similar News