IPL 2021: కోల్‌కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

IPL 2021: 10 పరుగుల తేడాలో గెలిచిన ముంబై ఇండియన్స్

Update: 2021-04-14 00:45 GMT

KKR vs MI, IPL 2021:(ఫైల్ ఇమేజ్)

IPL 2021 MI vs KKR: ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. ఐపీఎల్ సీజన్ 14లో ముంబై బోణి చేసింది. ఆఖరి 5 ఓవర్లలో ముంబై బౌలర్లు అదరగొట్టారు. కోల్‌కతా సునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్న క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇస్తూ.. 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని కేకేఆర్ ను చిత్తుగా ఓడిచింది. మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్‌ కార్తీక్‌ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. డెత్‌ ఓవర్లలో ముంబై కళ్లు చెదిరే బౌలింగ్‌తో అదరగొట్టింది.

అంతకు భారీ స్కోర్ అంచనాలను తలకిందులు చేసింది ముంబై ఇండియన్స్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్‌ తడబడింది. కేవలం యంగ్ హీరో సూర్య కుమార్‌ యాదవ్ ఒక్కడే కొంత మెరుపులు మెరిపించాడు. ‌(56/ 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై ఇండయన్స్ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ(43/ 32 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) కొంత వరకు రాణించాడు. అయితే అనుకున్నంతగా ఆడలేక పోయాడు.

ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబై భారీ స్కోరు చేయకుండా కోల్‌కతా బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ స్కోరు బోర్డ్‌ పరుగుకు అడ్డుకట్ట వేశారు. ఆండ్రీ రస్సెల్‌(5/15) ఐదు వికెట్లతో విజృంభించగా పాట్‌ కమిన్స్‌(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు అడ్డుకట్ట వేశారు. టాస్‌ ఓడిన ముంబైకి పెద్దగా పరుగుల వరద కురవ లేదు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(2) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో డికాక్‌.. త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రసిధ్‌ కృష్ణ వేసిన 8వ ఓవర్లో యాదవ్‌ వరుసగా 6,4,4 బాది 16 రన్స్‌ సాధించాడు.



Tags:    

Similar News