IPL 2020 Updates : ఐపీఎల్ లో ఆర్‌సిబి రాణించకపోవడానికి కారణం అదే.. గంభీర్

IPL 2020 Updates : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)13 వ సీజన్ మరికొన్ని రోజులలో మొదలుకానుంది..

Update: 2020-09-14 10:58 GMT

gambhir, kohli

IPL 2020 Updates : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)13 వ సీజన్ మరికొన్ని రోజులలో మొదలుకానుంది.. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీల కెప్టెన్సీ శైలికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. ముఖ్యంగా ఆర్‌సిబి జట్టు బలహీనతల గురించి గంభీర్ అభిప్రాయపడ్డాడు.. తనకు ఎలాంటి జట్టు కావాలో కోహ్లీ ఇకనైనా తెలుసుకోవాలని గంభీర్ ఈ సందర్భంగా సూచించాడు.

తుది జట్టులోని 11 మంది ఆటగాళ్ల గురించి కోహ్లీ ఎప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించాడు. కోహ్లీకి జట్టు ఎంపికపై పెద్దగా అవగాహన లేదని.. కేవలం ఆర్‌సిబి బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే చాలని అనుకుంటాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో RCB రాణించకపోవడానికి అది కూడా ప్రధాన కారణమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ యొక్క తాజా ఎపిసోడ్ లో ఈ వాఖ్యలు చేసారు గంభీర్..

ఇక విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, ధోని తన ఆటగాళ్లతో 6-7 మ్యాచ్‌లలో కొనసాగుతాడు. ఇక RCB చాలా త్వరగా మార్పులు చేస్తూ వచ్చింది. ఎందుకంటే వారి ప్లేయింగ్ XI కి సరైన బ్యాలెన్స్ లేదని వారికి అనుమానం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.. ఆర్‌సిబి తమ మొదటి ఐపిఎల్ 2020 ఆటను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సెప్టెంబర్ 21 న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.

Tags:    

Similar News