IPL 2020 Match 11 Updates: సన్ రైజర్స్ బోణీ.. స్వల్ప లక్ష్యం చేరుకోలేక చతికిల పడ్డ ఢిల్లీ!

IPL 2020 Match 11 Updates : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో 162 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో విఫలం అయింది ఢిల్లీ జట్టు.

Update: 2020-09-29 18:07 GMT

 హైదరాబాద్ ఇచ్చిన 163 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఢిల్లీ జట్టు చాలా నిదానంగా తన షో మొదలు పెట్టింది, మొదటి ఓవర్లోనే కీలకమైన పృధ్వీ షా వికెట్ కోల్పోవడంతో తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఆచి తూచి ఆడారు. దాంతో స్కోరు బోర్డు మందకొడిగా సాగింది. అతి జాగ్రత్తకు పోయిన బ్యాట్స్ మెన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా స్కోరు బోర్డు పరిగెత్తించే పని చేయలేకపోయారు. దీంతో ఢిల్లీ జట్టు విజయం సాధిస్తుందనే నమ్మకం 15 వ ఓవర్ వచ్చేసరికే పోయింది. చేసింది తక్కువ స్కోరు అయినా సన్ రైజర్ బౌలర్స్ దానిని కాపాడుకోవడంలో సఫలం అయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ జట్టుకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించారు.

ఢిల్లీ బ్యాటింగ్ ఇలా..

* భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే దిల్లీ ఓపెనర్‌ పృథ్వీషా(2) ఔటయ్యాడు. ఐదో బంతికి అతడు కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో దిల్లీ 2 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది.

* ఖలీల్‌ అహ్మద్‌ వేసిన రెండో ఓవర్‌లో దిల్లీ మూడు పరుగులు తీసింది. దీంతో రెండు ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 5/1గా నమోదైంది.

* భువి వేసిన మూడో ఓవర్‌లో దిల్లీ 5 పరుగులు రాబట్టింది. 3 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 10/1గా .

* నటరాజన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ధావన్‌(11) ఒక ఫోర్‌, ఒక సింగిల్‌ తీశాడు. దీంతో ఈ ఓవర్‌లోనూ ఐదు పరుగులె వచ్చాయి.

* 5 ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ వికెట్‌ నష్టానికి 27 పరుగులు చేసింది.

* రషీద్‌ ఖాన్‌ వేసిన 8వ ఓవర్‌ రెండో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌(17) భారీ షాట్‌ ఆడబోయి అబ్దుల్‌ సమద్‌కు చిక్కాడు. దీంతో దిల్లీ 8 ఓవర్లకు 43/2తో నిలిచింది.

* 10 ఓవర్లకు దిల్లీ 54/2తో నిలిచింది.

* రషీద్‌ఖాన్‌ వేసిన 12వ ఓవర్‌లో ధావన్‌(34) ఔటయ్యాడు. కీపర్‌ చేతికి చిక్కి వెనుతిరిగాడు. దీంతో 12 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 63/3గా నమోదైంది.

* అభిషేక్‌ శర్మ వేసిన 13వ ఓవర్‌లో పంత్‌ రెండు భారీ సిక్సర్లు బాదడంతో దిల్లీ 15 పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 78/3గా నమోదైంది.

* 15 ఓవర్లకు దిల్లీ 104/3తో నిలిచింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఈ ఓవర్‌లో ది హెట్‌మైయిర్‌ రెండు సిక్సర్లు కొట్టాడు.

* భువనేశ్వర్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి బంతికి హెట్‌మైయిర్‌(21) ఔటయ్యాడు. అతడు భారీ షాట్‌ ఆడి మనీష్‌ పాండే చేతికి చిక్కాడు. దీంతో దిల్లీ 104 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

* రషీద్‌ఖాన్‌ వేసిన 17వ ఓవర్‌లో పంత్‌(28) ఔటయ్యాడు. అతడు భారీ షాట్‌ ఆడగా ప్రియమ్‌ గార్గ్‌ చేతికి చిక్కాడు. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి దిల్లీ 119/5తో నిలిచింది.

* నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. చివరి బంతికి మార్కస్‌ స్టోయినిస్‌(11) ఎల్బీగా వెనుతిరిగాడు.

* భువి వేసిన 19వ ఓవర్‌లో రబాడ(6) ఒక ఫోర్‌ కొట్టడంతో పాటు మరో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి దిల్లీ 135/6 తో నిలిచింది.

* ఖలీల్‌ అహ్మద్‌ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌(5) ఔటయ్యాడు. ఆపై క్రిజులోకి వచ్చిన అన్‌రిచ్‌ జోర్జే 3) పరుగులు చేయగా.. రబాడ చివరి బంతికి సిక్సర్‌ కొట్టాడు. దీంతో దిల్లీ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. హైదరాబాద్‌ 15 పరుగులతో విజయం సాధించింది.

Tags:    

Similar News