IPL 2020: తడబడిన పంజాబ్‌..హైదరాబాద్‌ లక్ష్యం 127

IPL 2020: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆట చప్పగా సాగింది. స్లో పిచ్‌పై స్కోర్ బోర్డు ను ప‌రిగెత్తించడానికి బ్యాట్స్‌మెన్‌ తెగ కష్టపడ్డారు.

Update: 2020-10-24 16:18 GMT

IPL 2020: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆట చప్పగా సాగింది. స్లో పిచ్‌పై స్కోర్ బోర్డు ను ప‌రిగెత్తించడానికి బ్యాట్స్‌మెన్‌ తెగ కష్టపడ్డారు. పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. 

నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్:‌ 28 బంతుల్లో 2ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌(27), క్రిస్‌ గేల్‌(20) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఆఖర్లో పూరన్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో పంజాబ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (2/14), సందీప్‌ శర్మ (2/29), జేసన్ హోల్డర్‌ (2/27) సహా బౌలర్లంతా బంతితో విజృంభించి రాహుల్‌ సేనను 126/7కే కట్టడి చేశారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ పవర్‌ప్లేలో ఫర్వాలేదనిపించింది. 37 వద్ద మన్‌దీప్‌ సింగ్‌ (17; 14 బంతుల్లో 1×4) ఔటైనా 6 ఓవర్లకు 47/1తో నిలిచింది. క్రిస్‌గేల్‌, రాహుల్‌ జోరుగా ఆడుతుండటంతో పంజాబ్‌ భారీ స్కోరు చేస్తుందనిపించింది. అయితే 66 వద్ద గేల్‌ను హోల్డర్‌, రాహుల్‌ను రషీద్‌ఖాన్‌ పెవిలియన్‌ పంపించి భారీ దెబ్బకొట్టడంతో పంజాబ్‌కు వరుస షాకులు తగిలాయి. వ‌రుస‌గా మాక్స్‌వెల్‌ (12), దీపక్‌ హుడా (0), క్రిస్‌ జోర్డాన్ (7) మురుగన్‌ అశ్విన్ (4) వరుసగా పెవిలియన్‌ చేరడంతో పంజాబ్‌ 126/7కు పరిమితమైంది.

Tags:    

Similar News