IPL 2020: సెహ్వాగ్ గెటప్‌ అదుర్స్‌.. చెన్నైని సూపర్ స్టార్ కూడా కాపాడ‌లేడు

IPL 2020: షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణమైన ఓట‌మి పాలైంది. తొలుత‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసింది.

Karampoori Rajesh
Published on: 24 Oct 2020 8:51 PM IST
IPL 2020: సెహ్వాగ్ గెటప్‌ అదుర్స్‌.. చెన్నైని  సూపర్ స్టార్ కూడా కాపాడ‌లేడు
X

సెహ్వాగ్ గెటప్‌ అదుర్స్‌

IPL 2020: షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణమైన ఓట‌మి పాలైంది. తొలుత‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేసింది. స్వ‌ల్ప ల‌క్ష్య‌చేధ‌న‌కు దిగిన ముంబాయి ఒక్క వికెట్ ప‌డ‌కుండా అలవోక విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చెన్నైపై విమ‌ర్శనాస్త్రాలను సంధించాడు. ఐపీఎల్‌ 2020 సీజన్ ప్రారంభం నుంచి 'వీరు కి బైఠక్‌' అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గెటప్‌లో.. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై జట్టును సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా కాపాడలేడని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.

వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్ చేర‌డం విస్మ‌యానికి గురి చేసింద‌ని అన్నారు. ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో.. బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు. దీంతోపాటు ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌ పెద్దగా లేని ఆటగాళ్లకు వీరు చురకలు వేశాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story