IPL 2020: రాయుడు లేకనే ఓడిపోయాం: ధోని

IPL 2020: ఐపీఎల్‌ 13లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి పాలైంది. ఈ ఓటమితో వరుసగా రెండో మ్యాచ్‌ను కోల్పోయింది చైన్నై.

Update: 2020-09-26 06:43 GMT

IPL 2020: In Ambati Rayudu's absence, we're lacking a bit of steam in batting, says MS Dhoni

IPL 2020: ఐపీఎల్‌ 13లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి పాలైంది. ఈ ఓటమితో వరుసగా రెండో మ్యాచ్‌ను కోల్పోయింది చైన్నై. ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రేయస్ సేన సూపర్‌ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. సీఎస్‌కే 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది మరోసారి చెన్నై ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. అయితే..ఈ ఓటమిపై చైన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని స్పందించాడు.

'అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్‌ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌కాదు. తేమ లేనప్పటికీ వికెట్‌ నెమ్మదించింది. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది' అని ధోనీ అన్నాడు. ముంబయితో జరిగిన తొలి మ్యాచులో 48 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన రాయుడు గాయపడ్డ సంగతి తెలిసిందే.


 

Tags:    

Similar News