Asian Champions Trophy: భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర.. జపాన్‌పై ఘన విజయం
Asian Champions Trophy: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో జపాన్‌పై భారత పురుషుల హాకీ జట్టు ఘన విజయం సాధించింది.
Asian Champions Trophy
Asian Champions Trophy: భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో చైనాను మట్టికరిపించింది. తాజాగా మరో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఆరంభపోరులో 3-0తో చైనాకు చెక్ పెట్టింది. జపాన్‌పై కూడా హర్మన్ ప్రీత్ సింగ్ బృందం అదే జోరు కొనసాగించింది. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎత్తులను చిత్తు చేసి 5-1తో జయభేరి మోగించింది.