Ravi Shastri: భారత క్రికెటర్ల ఆదాయం రూ.100 కోట్లకు పైగానే: రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత స్టార్ క్రికెటర్ల ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత స్టార్ ఆటగాళ్ల వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Ravi Shastri: భారత క్రికెటర్ల ఆదాయం రూ.100 కోట్లకు పైగానే.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత స్టార్ క్రికెటర్ల ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత స్టార్ ఆటగాళ్ల వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు (వాణిజ్య ప్రకటనలు) ఈ భారీ సంపాదనకు కారణమని తెలిపారు.
‘ది ఓవర్‌ల్యాప్ క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి, భారత క్రికెటర్ల జీవనశైలి, ఒత్తిడులు, ఆదాయ వివరాలపై స్పందించారు. "నిజంగా వారు ఎంతో సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం అపారమైనది. కొంతమందికి అది సంవత్సరానికి రూ.100 కోట్లు దాటుతుంటుంది," అని వ్యాఖ్యానించారు.
ధోనీ, కోహ్లీ వాణిజ్య ప్రకటనల రాజులు
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లాంటి టాప్ ప్లేయర్లు తమ కెరీర్‌లో దాదాపు 15-20 వాణిజ్య ప్రకటనల్లో భాగమయ్యారని శాస్త్రి గుర్తు చేశారు. "ఒకే రోజు షూటింగ్ చేసి, ఆ ఫుటేజ్‌ను ఏడాది పాటు వాడతారు. ఇది తక్కువ సమయానికి అధిక ఆదాయాన్ని అందించే మార్గం," అని వివరించారు.
విదేశీ క్రికెటర్ల ఆశ్చర్యం
శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేయగానే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాఘన్, అలిస్టర్ కుక్ తాము విన్న వాటిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత క్రికెటర్ల ఆదాయాన్ని చూసి వారిద్దరూ స్పందించకమానలేదని సమాచారం.