IND vs SL: రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘనవిజయం

IND vs SL: శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ విజయం

Update: 2023-01-08 04:13 GMT

IND vs SL: రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘనవిజయం

IND vs SL: రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 2-1తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ స్కోర్ 228 పరుగులు చేయగా శ్రీలంక 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

టీమిండియా మరో సిరస్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టీ20 సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బ్యాటర్లలో శానక, ధనంజయ, అసలంక మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, హార్దిక్ 2, ఉమ్రాన్‌ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్‌ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్‌ 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో శతకం బాదాడు. శుభ్‌మన్‌ గిల్ 46 పరుగులు, రాహుల్‌ త్రిపాఠి 35 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మదుశంక రెండు రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News