Asian Games 2023: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా క్రీడలో ఫైనల్ చేరిన టీమిండియా.. పాక్‌తో తలపడే ఛాన్స్?

Asian Games 2023: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా క్రీడల ఫైనల్ చేరిన టీమిండియా.. పాక్‌తో తలపడే ఛాన్స్?

Update: 2023-10-06 05:23 GMT

Asian Games 2023: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా క్రీడలో ఫైనల్ చేరిన టీమిండియా.. పాక్‌తో తలపడే ఛాన్స్?

India vs Bangladesh, Semi Final 1 : ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ.

ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడే ఛాన్స్..

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో అక్టోబర్ 7న తలపడనుంది. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాయి.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్..

టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేయగలిగింది. జకీర్ అలీ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరపున ఆర్ సాయి కిషోర్ మూడు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, అరంగేట్రం ఆటగాడు షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్‌ : రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సాయి కిషోర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

బంగ్లాదేశ్: సైఫ్ హసన్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్, మహమూద్ హసన్ జాయ్, జకీర్ హసన్, అఫీఫ్ హొస్సేన్, షహదత్ హొస్సేన్, జకీర్ అలీ, రకీబుల్ హసన్, మృత్యుంజయ్ చౌదరి, హసన్ మురాద్, రిపన్ మండల్.

హెడ్-టు-హెడ్: టీ-20లో భారత్‌పై బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే గెలవగలిగింది.టీ-20లో హెడ్-టు-హెడ్ రికార్డ్: బంగ్లాదేశ్ కంటే భారత జట్టు బలంగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ ఒకదానిలో విజయం సాధించింది.

Tags:    

Similar News