IND vs SL: నేడు భారత్, శ్రీలంక మూడో టీ20
IND vs SL: ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
IND vs SL: నేడు భారత్, శ్రీలంక మూడో టీ20
IND vs SL: భారత్, శ్రీలంక జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. రాజ్‌కోట్ వేదికగా నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 1- 1 తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇవాళ ఇరు జట్లు మధ్య ఫైనట్ టీ20 జరగనుంది. తొలి రెండు టీ20ల్లో యువ భారత్ ఆటగాళ్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక దశ తర్వాత బౌలింగ్ పూర్తిగా అదుపు తప్పింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రెండుసార్లూ చేతులెత్తేశారు. తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి గెలిచిన హార్దిక్ సేన.. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆరంభం సరిగా లేక చివర్లో దెబ్బతింది. మరోవైపు లంక బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతోంది. మొత్తంగా సొంతగడ్డపై ప్రతాపం చూపించేందుకు టీమిండియా కసితో ఉంటే ఆసియా చాంపియన్స్‌గా తామేంటో నిరూపించేందుకు లంక ఊవ్విళ్లూరుతోంది.