Sydney Test : రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..

షమీ స్థానంలో శార్దూల్.. ఉమేష్ ప్లేసులో నటరాజన్ మూడో టెస్ట్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్

Update: 2021-01-01 16:09 GMT

రెండో టెస్టులో అద్భుత విజయంతో జోష్ మీదున్న టీమిండియా.. సిడ్నీపై కన్నేసింది. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఆధిక్యం సాధించాలన్న కసితో ఉంది. జట్టులో చేరిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా.. యార్కర్ కింగ్ నట్టూ టెస్ట్ ఆరంగేట్రం చేయనున్నాడు. టీమిండియా యువపేసర్ నటరాజన్ మరోసారి జాక్‌పాట్ కొట్టాడు. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు సెలక్ట్ అయ్యాడు. గాయం కారణంగా ఉమేష్ యాదవ్ జట్టుకు దూరంకాగా.. అతని స్థానాన్ని ఉమేష్ భర్తీ చేయనున్నాడు. ఇక అటు క్వారంటైన్ పూర్తి చేసుకొని జట్టులో చేరిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పుజారా నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయ్. ముఖ్యంగా పేసర్లు ఇబ్బందులు పడుతున్నారు. సిరీస్‌కు ముందే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ గాయపడగా.. మధ్యలో షమీ, ఉమేష్ యాదవ్‌కు ఇంజ్యూరీస్ అయ్యాయ్. ఐతే వీరిద్దరికి రెస్ట్ అవసరమని మెడికల్ టీమ్ చెప్పింది. దీంతో షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్‌ జట్టులోకి వచ్చారు. నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చేరుకున్న నటరాజన్‌... నెలరోజుల వ్యవధిలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ముందుగా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రానికి రెడీ అవుతున్నాడ్. అత్యంత నిలకడ, కచ్చితత్వంతో యార్కర్లు సంధించడం నటరాజన్ స్పెషాలిటీ.




Tags:    

Similar News