IND vs PAK: పాక్ తో మ్యాచ్ కు ముందు టీం ఇండియాకు షాక్.. అస్వస్థతకు గురైన స్టార్ ప్లేయర్

IND vs PAK: నేడు దుబాయ్‌లో అతిపెద్ద క్రికెట్ సమరం జరగబోతోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి.

Update: 2025-02-23 05:19 GMT

IND vs PAK: పాక్ తో మ్యాచ్ కు ముందు టీం ఇండియాకు షాక్.. అస్వస్థతకు గురైన స్టార్ ప్లేయర్

IND vs PAK: నేడు దుబాయ్‌లో అతిపెద్ద క్రికెట్ సమరం జరగబోతోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నద్ధమవుతుండగా, టీమ్ ఇండియాకు ఒక చేదు వార్త అందింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మ్యాచ్ కు ఒక రోజు ముందు అస్వస్థతకు గురయ్యాడు. పంత్ అనారోగ్యంతో టీం ఇండియాలో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు జట్టుకు కేఎల్ రాహుల్ ఒకే ఒక్క వికెట్ కీపర్ ఉన్నాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు కేవలం ఒక రోజు ముందు టీం ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పంత్ గురించి ఈ సమాచారాన్ని అందించాడు. ఫిబ్రవరి 22, శనివారం టీం ఇండియా ప్రాక్టీస్ సెషన్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రిషబ్ పంత్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని, దాని కారణంగా అతను ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేకపోయాడని శుభ్‌మాన్ గిల్ వెల్లడించారు. పంత్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని, అందుకే ఈ ప్రాక్టీస్ సెషన్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చామని భారత వైస్ కెప్టెన్ తెలిపారు.

ఆదివారం జరిగే మ్యాచ్ కు ముందు పంత్ ఫిట్ గా ఉంటాడా లేదా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అయితే, పంత్ లేకపోవడం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రభావితం చేస్తుంది. కానీ తప్పని సరి పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ కోసం టీం ఇండియా తమ తొలి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా కెఎల్ రాహుల్‌ను నియమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతను ఆడాడు. వైరల్ ఫీవర్ కారణంగా పంత్ రెండవ మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు.

పంత్ అనారోగ్యానికి గురికావడం టీం ఇండియాకు ఆందోళన కలిగించే విషయం.. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు లేదా మ్యాచ్ సమయంలో రాహుల్‌కు ఏదైనా జరిగితే.. పంత్ కూడా ఫిట్‌గా లేకుంటే టీం ఇండియా వికెట్ కీపర్‌ సమస్యను ఎదుర్కొంటుంది. ఈ ఇద్దరు తప్ప భారత జట్టులో మూడవ వికెట్ కీపర్ లేడు. రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉండటమే కాకుండా, పంత్ కూడా వీలైనంత త్వరగా జ్వరం నుండి కోలుకోవాలని భారత జట్టు ఆశిస్తుంది.

2023 ప్రపంచ కప్ తర్వాత వన్డే క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. 2018 ఆసియా కప్ తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ ఫార్మాట్‌లో వారు తొలిసారి తలపడబోతున్నారు. ఆసియా కప్‌లో దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. టీం ఇండియా రెండు మ్యాచ్‌లలో గెలిచింది. ఈసారి టీం ఇండియా హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీఫైనల్‌కు చేరుకోవాలని ప్రయత్నిస్తుంది.

Tags:    

Similar News