IND vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
IND vs AUS: 99 పరుగుల తేడాతో భారత్ గెలుపు
IND vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
IND vs AUS: ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆటకట్టించిన భారత్ బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్రపోషించారు. రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్, మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు 5 వికెట్లను నష్టపోయి 399 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభంలోనే ఔటైనప్పటికీ... శుభమన్‌గిల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరుబోర్డును పరుగులుపెట్టించారు. ఇద్దరూ పోటీపడి శతకాలను నమోదుచేశారు. ఆ తర్వాత లోకేశ్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడారు. రాహుల్ అర్థసెంచరీతర్వాత పెవీలియన్ బాటపట్టాడు. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్37 బంతుల్లో 6 బౌండరీలు, 6 సిక్సర్లతో 72 పరుగులు నమోదు చేసి అజేయంగా నిలిచాడు.
400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లను ప్రసిద్ధ క్రిష్ణ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బోల్తా కొట్టించాడు. కీలకమైన రెండు వికెట్లను పడగొట్టి విజయానికి పునావి వేశాడు. వర్షం కురవడంతో 33 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. డక్ వర్త్ లూయీస్ విధానంతో 33 ఓవర్లలో 317 పరుగులు విజయలక్ష్యంగా నిర్ధేశించారు. ఆతర్వాత డేవిడ్ వార్నర్, సీన్ అబ్బాట్ అర్థ సెంచరీలు నమోదు చేశారు. 28 ఓవర్ల 2 బంతులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత్ 99 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.